NTV Telugu Site icon

PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం

Pmmodi

Pmmodi

హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. నవరాత్రి సమయంలో హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం శుభసూచకం అన్నారు. కార్యకర్తల కృషితోనే హర్యానాలో విజయం సాధించామని తెలిపారు. హర్యానా విజయం ప్రజాస్వామ్య విజయం అని అభివర్ణించారు. హర్యానా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని ప్రధాని మోడీ తెలిపారు.

‘‘హర్యానాలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తారు. కానీ ఈసారి బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. బలహీన వర్గాలను కాంగ్రెస్ పట్టించుకోదు. వాళ్లను ఓటు బ్యాంకుగానే చూస్తుంది. కులం పేరంతో కాంగ్రెస్ విద్వేషాన్ని చిమ్ముతోంది. గీతాభూమిలో సత్యం, అభివృద్ధి, సుపరిపాలన విజయం సాధించాయి. జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల విజయం. హర్యానాలో అబద్ధాల మూటపై ‘వికాసం’ పైచేయి సాధించింది. ’’ అని మోడీ తెలిపారు.

జమ్మూకాశ్మీర్‌లో విజయం సాధించిన కాంగ్రెస్-ఎన్సీ కూటమికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ కూటమికి అత్యధిక సీట్లు ఇచ్చారన్నారు. అయినా కూడా జమ్మూకాశ్మీర్‌లో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సీట్లే సాధించామన్నారు. అంతేకాకుండా ఓట్లు శాతం కూడా గణనీయంగా పెరిగిందని మోడీ వెల్లడించారు.

 

Show comments