హర్యానా ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
Rahul Gandhi : హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఎన్నికల ప్రచారం చివరి వారంలో కాంగ్రెస్ తన పూర్తి బలాన్ని చాటుతుంది. రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ సర్కిల్స్‌లో ఎన్నికల రథయాత్ర చేపట్టనున్నారు.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి రెజ్లర్లు ఇద్దరూ బరిలోకి దిగనున్నారు.
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే వారు హస్తం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.