వచ్చే నెలలో భారత్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగారు.. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు.. అయితే, ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపికచేసిన తర్వాత.. సోషల్ మీడియాలో ఆమె స్వగ్రామంపై పెద్ద చర్చే సాగుతోంది.. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం.. ఆమె ప్రస్తుతం ఆ గ్రామంలో నివసించకపోయినా.. ఆమె బంధువులు కొందరు ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు.. అయితే, ఆ గ్రామానికి ఇప్పటికీ కనీస వసతులు లేవు.. ఆ గ్రామమే కాదు.. కరెంట్ లేక చాలా గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి.. కనీసం నీటి వసతి కూడా లేక అల్లాడిపోతున్నాయి.. అంటే.. మన నేతలు చెబుతున్న అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు తమ గోడు వెల్లబోసుకున్నా.. పట్టించుకున్ననాథుడు లేడు.. ఎన్నికల సమయంలో తప్పితే.. ఆ ప్రాంతానికి వచ్చేవాళ్లు కూడా లేరట..
Read Also: Astrology: జూన్ 27, సోమవారం దినఫలాలు
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన తర్వాత ఆమె సొంత గ్రామం జాతీయస్థాయి వార్తల్లో నిలిచింది.. రాష్ట్రపతి అభ్యర్థి స్వగ్రామం పరిస్థితి ఇదంటూ నెటిజన్లు ఆ వార్తలను వైరల్ చేశారు.. ప్రతిపక్షాలు ఆ వార్తలను విమర్శలకు ఉపయోగించుకుంటున్నాయి.. ఈ తరుణంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. వెంటనే ఆ గ్రామానికి కరెంటు కల్పించేందుకు సిద్ధం అయ్యింది.. ప్రకటనకే పరిమితం కాకుండా.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు.. దీంతో ఎన్నో ఏళ్లుగా చీకటిలో మగ్గుతున్న ఆ ప్రాంత ప్రజలకు మోక్షం లభించినట్టు అవుతుంది..
కాగా, ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం.. ఆమె ఆ గ్రామానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని పట్టణంలో నివాసం ఉంటున్నారు.. ఆమెకు సంబంధించిన కొందరు బంధువులు ఇప్పటికీ ఆ గ్రామంలోనే ఉంటున్నారు.. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో నిలవగానే ఆమె గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఆమె గ్రామానికి వెళ్లారు. ముర్ము గురించి స్థానికులను అడిగి తెలుసుకునే క్రమంలో అక్కడ కరెంటు లేదనే విషయం వెలుగులోకి వచ్చింది.. తమ గోడును ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు వెల్లబోసుకున్నా.. పట్టించుకోలేదని ఆ గ్రామస్థులు వాయాపోయారు.. ఆ ఊరి కరెంట్ కష్టాలు.. మీడియా నుంచి సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేశాయి.. దీనిపై స్పందించిన ఉత్తర ఒడిశా విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు.. వెంటనే ఆ గ్రామానికి విద్యుత్ వసతి కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు.. దీంతో ఉపర్బెడా గ్రామంలోకి హుటాహుటిన దిగిన అధికారులు.. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, యంత్రాలతో రంగంలోకి దిగి పనులు చేపట్టారు.. అసలు విషయం ఏంటంటే.. ఆ గ్రామం ఇప్పటికే ఎంతో మంది ప్రజాప్రతినిధులు అందించింది.. అయినా ఆ గ్రామాన్ని పట్టించుకున్నవారు లేరు.. ఎంపీలు, మంత్రులుగా పనిచేసినా.. సొంత ఊరిని పట్టించుకోలేదట.. మొత్తంగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగడంతో.. ఆ గ్రామంలోని కరెంట్ కష్టాలు తీరుతున్నాయి.