Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Awards: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాల ప్రదానోత్సవంతో అత్యంత వైభవంగా మెరిసిపోయింది. వివిధ రంగాల్లో దేశానికి అసమాన సేవలు అందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మ అవార్డులతో సత్కరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.
మమ్ముట్టి, విజయ్ అమృత్ రాజ్‌లకు పద్మభూషణ్..
భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గానూ మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృత్ రాజ్‌ను కూడా ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. వైద్యరంగంలో చేసిన విశేష సేవలకు గానూ ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు.
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
శిబు సోరెన్‌కు మరణానంతర పురస్కారం
జేఎమ్ఎమ్ (JMM) వ్యవస్థాపకుడు, ప్రముఖ గిరిజన నాయకుడు శిబు సోరెన్‌కు ప్రజాసేవ విభాగంలో మరణానంతరం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన తరఫున సతీమణి రూపి సోరెన్ ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళిలకు పద్మశ్రీ
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌లను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో వారు ఈ అవార్డులను అందుకున్నారు.
విజ్ఞాన, సాంకేతిక (Science & Technology) రంగాల్లో చేసిన అద్భుత సేవలకు గుర్తింపుగా తెలంగాణకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త చంద్రమౌళికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాల విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో ఈ వేడుక కంటిపండుగలా సాగింది.
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!