Prashant Kishor: పది పాస్ కాని తేజస్వీ యాదవ్ సీఎం కావాలని కలలు కంటున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishore criticizes Bihar Deputy CM Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. సొంత రాష్టమైన బీహార్ లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ఆయన తేజస్వీ యాదవ్ ని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించారు. బీహార్ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్( సీటెట్)కి అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందిన విద్యావంతులు ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంటింటికి పడిగాపులు పడుతున్నారని.. చదువురాని రాజకీయ నాయకులు పిల్లలు మాత్రం ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని తేజస్వీ యాదవ్ ని ఉద్దేశించి విమర్శించారు.
Read Also: Minister Malla Reddy: నాయకులకు “చాయ్” ఇస్తున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
Also Read
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!
10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేసిన ప్రభుత్వం టెట్, సీటెట్ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులపై లాఠీ చార్జి చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. పదో తరగతి పాస్ కాని వ్యక్తి సీఎం కావాలని కలలు కంటున్నారని తేజస్వీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే బీజేపీ పొత్తును కాదని సీఎం నితీష్ కుమార్ జేడీయూ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ‘మహాఘట బంధన్’ కూటమిని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ తన తదుపరి నాయకుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తేజస్వీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మహాఘటబంధన్ కూటమికి నాయకత్వం వహిస్తారని నితీష్ కుమార్ అన్నారు. 2024లో విపక్షాల కూటమి మోదీ, బీజేపీని ఓడిస్తుందని.. తేజస్వీ నేతృత్వంలో 2025లో బీహార్ లో మళ్లీ అధికారాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ అన్నారు.
తాజావార్తలు
-
Kamakshi: “సెక్స్‌ను బూతులా ఎందుకు చూస్తారు?”.. కామాక్షి స్ట్రాంగ్ స్టేట్మెంట్
-
Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్‌లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
-
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!