Uttarpradesh : లోక్‌సభ ఎన్నికల నిష్పక్షపాతత, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక యువకుడు బిజెపికి చాలాసార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోపై వివాదం తలెత్తడంతో, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ ఇటాహ్‌లోని యువకుడిపై కేసు పెట్టారు. అలాగే పోలింగ్ బృందాన్ని సస్పెండ్ చేయాలని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా సంబంధిత పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి సిఫార్సు చేశారు.
Read Also:Iran: 17గంటల తర్వాత దొరికిన హెలికాఫ్టర్ శిథిలాలు..ఇరాన్ అధ్యక్షుడి మృతి
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఎన్నికల సంఘం.. బిజెపిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు ఎనిమిది సార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించింది. పదే పదే పోలింగ్ బూత్ కు వచ్చి బీజేపీకి ఓటేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటూ.. ఓ వ్యక్తి పలుమార్లు ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ తెలిపారు. ఈ సంఘటనపై ఎటా జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్లు 171-ఎఫ్, 419, ఆర్‌పి యాక్ట్ 951 సెక్షన్లు 128, 132, 136 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Read Also:Prasanth Varma : రణ్ వీర్ తో సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ..?
రీపోలింగ్ కోసం సిఫార్సు
వీడియోలో చాలాసార్లు ఓటు వేసిన వ్యక్తిని ఖిరియా పామ్రాన్ గ్రామ నివాసి అనిల్ సింగ్ కుమారుడు రాజన్ సింగ్‌గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు పోలింగ్ పార్టీ సభ్యులందరినీ సస్పెండ్ చేయాలని, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి సిఫార్సు చేశారు. ఓటరు గుర్తింపు ప్రక్రియను కచ్చితంగా పాటించాలని యూపీలోని ఇతర దశల్లోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారి తెలిపారు. ఎన్నికల్లో అవకతవకలు చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు.
अगर चुनाव आयोग को लगे कि ये गलत हुआ है तो वो कुछ कार्रवाई ज़रूर करे, नहीं तो…
भाजपा की बूथ कमेटी, दरअसल लूट कमेटी है। #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/8gwJ4wHAdw
— Akhilesh Yadav (@yadavakhilesh) May 19, 2024