దేశంలో వీఐపీలకు కరోనా టెన్షన్.. రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా వరుసబెట్టి వీఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బీహార్ సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీష్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. గత మంగళవారం పలువురు మంత్రులు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు.
అటు ఇప్పటికే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడగా… తాజాగా కేంద్ర బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!