Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇటీవల ఓ సామాన్య వ్యక్తి విధాన సౌధలోకి వచ్చి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన తెలిసిందే. అది మరువకముందే సోమవారం మరో ఘటన జరిగింది. కర్ణాటక అసెంబ్లీలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. విధాన సౌధ వద్ద పోలీసుల తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విధాన సౌధ వద్ద ఇటీవల చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఓ మహిళను తనిఖీ చేస్తుండగా ఆమె వద్ద కత్తి లభించడం కలకలం రేపింది. తూర్పు ద్వారం గుండా ఆ మహిళ లోపలికి వస్తుండగా.. అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్ మెషిన్‌లోకి పంపగా అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగ్నల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది.
Read also: Alla Nani: జగన్‌ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
పోలీసులు మహిళ బ్యాగులో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకుని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న ఓ విభాగంలో పనిచేసే సిబ్బంది అని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఘటన నేపథ్యంలో విధాన సౌధ స్పీకర్ అసెంబ్లీ పరిసరాలను పరిశీలిస్తున్నారు. గతవారం బడ్జెట్ సమావేశాల సమయంలో ఓ వ్యక్తి దర్జాగా సభలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడంతో మార్షల్స్ అతడిని బయటకు తీసుకెళ్లారు. సదరు వ్యక్తిని 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా గుర్తించారు. విజిటర్స్ పాస్ సంపాదించిన రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్ సైతం అడ్డుచెప్పకపోవడంతో సభలోకి సులువుగా ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడని వివరించారు. రుద్రప్పపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!