PMO Rename: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చారు.
Read Also: Rameshwaram Cafe: ఎంతకు తెగించార్రా.. రామేశ్వరం కేఫ్‌పై కేసు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న ప్రధాని కార్యాలయాన్ని ఇకపై ‘‘సేవా తీర్థ్’’గా పిలువనున్నారు. పాలనలో సేవా స్పూర్తిని ప్రోత్సహించడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో కేంద్రం దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ భవనాలు, రోడ్ల పేర్లను మార్చింది. గతంలో ప్రధాని నివాసం ఉన్న మార్గాన్ని ‘‘లోక్ కళ్యాణ్ మార్గ్’’గా మార్చారు. ఢిల్లీలోని రాజ్ పథ్ ను ‘‘కర్తవ్య పథ్’’గా మార్చారు.