కాసేపట్లో లోక్‌భవన్‌కు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకోనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేయనున్నారు. వైసీపీకి చెందిన 40 మందికి మాత్రమే గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులు లోక్‌భవన్‌కు చేరాయి. గవర్నర్‌కు కలిసేందుకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో జగన్ విజయవాడ బయలుదేరారు.…
PMO Rename: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చారు.
MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు.