Covid-19: మరోసారి కరోనాపై యుద్ధానికి సిద్ధం, ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Review on Covid-19: కోవిడ్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న ప్రమాదం ఆసన్నమైందని సంకేతాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా కోవిడ్‌ను నియంత్రించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇవాల మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇక, గతంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదైన సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే.
read also: Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
చైనా, దక్షిణ కొరియా, జపాన్ మరియు అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భారతదేశం అప్రమత్తమైంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనాలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత.. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ చైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. చైనా, అమెరికా, దక్షిణ కొరియా దేశాల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం దాదాపు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా, దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కోవిడ్ యొక్క నాల్గవ వేరియంట్‌కు సంబంధించిన కోవిడ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే రెండేళ్ల క్రితం నాటి పరిస్థితి తప్పదని రాష్ట్రాలను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో జరుగుతున్న కేసులు, పరీక్షల గురించి అధికారులను ప్రధాని అడిగి తెలుసుకుని కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది.
PM Narendra Modi to review the situation related to #COVID19 and related aspects in the country at a high-level meeting today afternoon. pic.twitter.com/26DBWbvtcy
— ANI (@ANI) December 22, 2022
Khudiram Bose: పార్లమెంట్ సభ్యుల కోసం నేడు ప్రత్యేక ప్రదర్శన!
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్‌సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!