PM Modi: నేడు మహారాష్ట్రలో రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన..
- నేడు మహారాష్ట్రలో రూ. 7600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన..
- నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడ్..
- మహారాష్ట్రలో కొత్తగా మరో 10 వైద్య కళాశాలలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో సుమారు 7,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడ్‌కు దాదాపు రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో ఆయన శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఇది నాగ్‌పూర్- విదర్భ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
Read Also: AHA : కంటెంట్ బేస్డ్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ‘ఆహా’ “గొర్రె పురాణం”కి రికార్డు వ్యూస్
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
అలాగే, షిర్డీ విమానాశ్రయంలో రూ. 645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ టెర్మినల్ షిర్డీని సందర్శించే మతపరమైన పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సాయిబాబాకు సంబంధించిన వేప చెట్టు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే, ముంబై, నాసిక్, అమరావతి సహా మహారాష్ట్ర అంతటా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Read Also: Iran Israel War: హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 50 మంది ఉగ్రవాదులు మృతి
ఇక, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ముంబై.. అధునాతన సాంకేతికత- మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి రంగాల్లో ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వనుంది. దీంతో పాటు చాట్‌బాట్ టెక్నాలజీ ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులకు కీలకమైన అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ డేటాను అందించడానికి విద్యా సమీక్షా కేంద్రాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!