Cabinet Decisions: ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో మొదటగా యాక్డియం 4 మిషన్ సక్సెస్, శుభాంశు శుక్లాను కేబినెట్ అభినందించిందన్నారు. అలాగే, రైతుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. ప్రధాని ధన్‌ధాన్య కృషి యోజన పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష్యంగా లబ్ధి చేకూరేలా ఏడాదికి 24,000 కోట్ల రూపాయలు అందజేస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
Read Also: Movie Ticket Prices: ఏ సినిమా థియేటర్స్ అయినా టికెట్ రూ.200 దాటకూడదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
అలాగే, ప్రైమ్ మినిస్టర్ ధన్‌ధాన్య క్రిష్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా 100 వ్యవసాయ ఆధారిత జిల్లాలను అభివృద్ధి చేయనున్నట్లుగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. పునరుత్పాదక శక్తిలో పెట్టుబడి పెట్టడానికి NTPCని బలోపేతం చేయడంతో పాటు NTPC గ్రీన్ (NGEL) – NTPC అనుబంధ సంస్థ – గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తుంది అన్నారు. ఇక, NTPC ఈక్విటీ ఇన్ఫ్యూషన్ రూపంలో NGELలో ఇప్పటి వరకు రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. NGELలో రూ.20,000 కోట్ల పెట్టుబడికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.