PM Modi Xi Jinping: ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ..
- ఐదేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ.. జిన్‌పింగ్ భేటీ..
- సరిహద్దు ఒప్పందం కుదిరిన మూడు రోజుల తర్వాత మీటింగ్..
- బ్రిక్స్ వేదికగా ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Xi Jinping: దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది.
Read Also: KTR: నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్..
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
గల్వాన్ ఘర్షణ తర్వాత తూర్పు లడాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదిలా ఉంటే, బ్రిక్స్ సమావేశాలకు ముందు భారత్-చైనాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇదు దేశాల సైనికులు సరిహద్దు నుంచి విత్ డ్రా చేసుకోవాలనే ఒప్పందాన్ని ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో డెప్సాంగ్, డెమ్‌చోక్‌లో రెండు దేశాల సైన్యం ఉపసంహరణ ప్రారంభమైంది. గతంలో అనేక సార్లు రెండు దేశాల సైన్యం మధ్య చర్చల అనంతరం పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్ స్ప్రింగ్ వంటి ప్రాంతాల నుంచి సైనిక ఉపసంహరణ జరిగింది.
చివరిసారిగా ఇద్దరు నేతలు 2019లో కలుసుకున్నారు. చైనా-ఇండియా మధ్య ఈ ఒప్పందం కుదిరిని మూడు రోజుల్లోనే మోడీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు నవంబర్ 2022లో ఇండోనేషియాలోని బాలిలో జరిగే G20 శిఖరాగ్ర సమావేశంలో, ఆగస్టు 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ఇద్దరు నేతల పలకరింపులు మాత్రమే చోటు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. నాలుగేళ్లుగా రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా లేవు. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా యాప్స్ నిషేధించడంతో పాటు చైనా పెట్టుబడులపై భారత్ నిఘా పెంచింది. ప్రస్తుత సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ అవుతాయని అంతా భావిస్తున్నారు.
- Tags
- BRICS
- PM Modi
- Russia
- Xi Jinping
తాజావార్తలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!