PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
- తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
- మహిళా సాధికారిత దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు
- మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా మోడీ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికారిత దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. ‘‘నేటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికారత దిశగా దేశం చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. మా తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవం. ఇదే స్ఫూర్తితో మేము ఆ దిశగా దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాము.’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: BJP Chief Ministers: దేశంలో పెరిగిన బీజేపీ సీఎంలు.. సంఖ్య ఎంతంటే..!
Also Read
నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు.
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేచి చూడాలి.
PM Narendra Modi tweets, "Starting today, in the special session of Parliament, our country is all set to take a historic step towards women's empowerment. The respect for our mothers and sisters is the respect for the nation, and with this very spirit, we are moving forward… pic.twitter.com/JCiT5udHCh
— ANI (@ANI) April 16, 2026
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!