PM Modi: రేపు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ రేపు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన్నారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ. 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ నాలుగు లేన్లతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడింది. దీనిని ఆరు లేన్ల వరకు కూడా విస్తరించవచ్చు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. శనివారం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని సోదరీమణులు, సోదరులకు ప్రత్యేకమైన రోజని.. జలౌన్ జిల్లాలో ఒక కార్యక్రమంలో, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించబడుతుందని.. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ శనివారం జలౌన్ జిల్లా ఒరై తహసీల్‌లోని కైతేరి గ్రామంలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్నారు.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద ఎన్‌హెచ్-35 నుంచి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందే పూర్తయింది. ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేతో కలిసిపోతుంది. ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావాతో సహా ఏడు జిల్లాల గుండా వెళుతుంది. దీనికి 13 ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా రూ.1,132 కోట్లు ఆదా చేసింది. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించడం ద్వారా ఢిల్లీ-చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!