Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ‘‘బాబ్రీ మసీదు’’ ఎమ్మెల్యే..
- రెజి నగర్ నుంచి బీజేపీ గెలుస్తుందని చెప్పిన హుమాయున్ కబీర్..
- సువేందు అధికారి సీఎంగా ఉన్నంత కాలం అసెంబ్లీ వెళ్లనని శపథం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Humayun Kabir: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రాజ్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులతో తీవ్ర వాగ్వాదం అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. 12 గంటల తర్వాత పోలీసులు ఆయనను విడుదల చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ ఏర్పాటు చేసిన హుమాయున్ కబీర్ బుధవారం మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో అధిక ముస్లింలు ఉన్న రెజినగర్ అసెంబ్లీలో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. తన పట్ల రాజకీయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరుపై నిరాశ వ్యక్తం చేశారు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత నౌడాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు క్షమాపణలు చెబుతానని, తన 64 ఏళ్ల జీవితంలో ఇక ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారుు. నౌదా ప్రజల్లో మెజారిటీ తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరితే, తాను రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా కొనసాగితే తాను అసెంబ్లీకి వెళ్లనని శపథం చేశారు. ఇందుకు నౌడా ప్రజల్ని క్షమించాలని కోరారు. రెజినగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని హుమాయున్ కబీర్ అన్నారు. రెజినగర్‌లో పోలింగ్ నిష్పక్షపాతంగా జరగలేదని ఆరోపించారు.
2025 డిసెంబర్లో బెంగాల్ ఎన్నికల ముందు ముర్షిదాబాద్‌లోని బెల్డంగాలో అయోధ్యలోని బాబ్రీ మసీదు నమూనాతో కొత్త మసీదు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 2025 డిసెంబర్ 6న పెద్ద ఎత్తున ముస్లిం మతగురువుల్ని తీసుకువచ్చి, శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో రెజినగర్, నౌడా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. ఆ తర్వాత రెజినగర్కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Promised to build Babri Masjid in Murshidabad few months back.
Has decided to quit politics now. ☠️ https://t.co/UlRbRCIUJ1
— Upamanyu Bhattacharya (@upamanyu95) October 7, 2026
తాజావార్తలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!