PM Modi: బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ని మరోమారు హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని గురువారం చెప్పారు. పాకిస్తాన్ గడ్డపై భారత్ మూడుసార్లు దాడి చేసిందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.