అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కన్నుమూశారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ రూపానీ విమానం ఎక్కారు.
అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో అందరూ చనిపోతే.. ఒకే ఒక్కడు సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాపీగా బయటకు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో కూర్చున్నాడు.
ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని మోడీ పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు.