ప్రధాని మోడీ కేరళ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం మోడీ తిరువనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మోడీకి నాయకులు సత్కారాలు చేస్తున్నారు. అక్కడే ఉన్న ఒక మహిళ.. మోడీ పాదాలకు నమస్కరించింది. వెంటనే మోడీ కూడా ప్రతిగా ఆమె పాదాలకు నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
త్వరలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. తొలుత కేరళలో పర్యటించిన మోడీ.. స్టేజ్‌పైకి వచ్చాక ఒక మహిళ పాదాలకు నమస్కరించబోయింది. వెంటనే మోడీ కూడా ప్రతి నమస్కారం చేశారు.
ఇది కూడా చదవండి: Kashmir: కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. విమాన సర్వీసులు రద్దు
ఇక కేరళలో మార్పు అనివార్యమని ప్రధాని మోడీ అన్నారు. ఈసారి ఎలాగైనా కేరళలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందుకు తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అవినీతిని బీజేపీ అంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆభరణాల దారి మళ్లింపు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.