PM Modi: విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించనున్న మోడీ
- విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించనున్న మోడీ
- మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కన్నుమూశారు. లండన్‌లో ఉన్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ రూపానీ విమానం ఎక్కారు. మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ మీద కూలిపోవడంతో అక్కడ ఉన్న 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 265 మంది మృతి.. కొనసాగుతున్న పోస్టుమార్టం
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
ప్రస్తుతం ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ప్రమాదంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని మోడీ పరామర్శించనున్నారు. కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పనున్నారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Tragedy: భారతదేశ వ్యాప్తంగా బోయింగ్ 787-8 విమానాలు నిలిపివేత..?
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికోలు కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.
Ahmedabad | PM Modi visited the AI-171 plane crash site and took stock of the situation pic.twitter.com/gFN3ezzvtQ
— ANI (@ANI) June 13, 2025
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?