KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Challenges Revanth Reddy: హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన యూత్ డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఇదే సరూర్నగర్ వేదికపై కాంగ్రెస్ నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా యువతకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్లు, మహిళలకు స్కూటీలు, భారీ ఉద్యోగ నియామకాలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీభవన్ నుంచి గాడ్సేలు వచ్చి యువతను మోసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. “కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను” అని అన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వనని మాట్లాడుతున్నారని ఆరోపించిన కేటీఆర్.. “తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగీరా?” అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను “బీరు, బిర్యానీ బ్యాచ్” అని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు.
నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారికి ఆకలి ఉద్యోగాల కోసమేనని కేటీఆర్ పేర్కొన్నారు. యువశక్తి ఒక్కసారి పోటెత్తితే అధికార పీఠాలు కదిలిపోతాయని హెచ్చరించారు. చివరగా రేవంత్ రెడ్డి పాలనకు ముగింపు హిట్లర్ ముగింపుకంటే దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!