PM Narendra Modi: మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ కీలక ప్రకటన..
- ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రకటన..
- మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
- మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలోమోడీ ఓ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయబోతున్నారు.. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారిగా పార్లమెంటులో స్పందించనున్న ప్రధాని, దేశానికి సంబంధించిన భద్రతా చర్యలు, భవిష్యత్ సవాళ్లపై వివరించనున్నట్లు సమాచారం.
ప్రధాన అంశాలు:
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం
దేశ భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు చర్యలు
చమురు నిల్వలు, ఇంధన భద్రతపై సమగ్ర ప్రణాళిక
ప్రజలపై ఆర్థిక భారం పడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు
Also Read
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సహచర కేబినెట్ మంత్రులతో కలిసి చమురు నిల్వలు, ఇంధన సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఇంధన కొరత లేకుండా చూసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వినియోగదారులపై ప్రభావం తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు సమాచారం.
లోకసభలో కీలక ప్రసంగం:
ఇలాంటి సమయంలో లోకసభలో ప్రధాని మోడీ చేసే ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మధ్యప్రాచ్య పరిణామాల ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందో, దాన్ని ఎలా ఎదుర్కొంటామనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా, ప్రధాని మోడీ ప్రసంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ప్రజలు, మార్కెట్లు, పరిశ్రమలు ఈ ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. గతంలో కీలక సమయాల్లో ప్రధాని మోడీ ప్రసంగించినప్పుడు.. ఎన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం.. మరి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!