ఇండియాకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం ఇండియా తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్షస్థానంలో ఇండియా ఉండటం విశేషం. ఇండియా అధ్యక్షతన సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఇండియా తరపున ప్రధాని మోడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగబోతున్నది. భద్రతా మండలిలోని సభ్యదేశాలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సముద్ర భద్రతా, నేరాలు, తీర ప్రాంతంలోని దేశాల మధ్య సంబందాలు బలోపేతం తదితర అంశాలపై ఈ సామావేశం జరగనున్నది. గతంలో 9 సార్లు ఇండియా భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఉన్నప్పటికీ ఎలాంటి బహిరంగ సమావేశం జరగలేదు. భద్రతా మండలిలో అధ్యక్షస్థానంలో ఉండటం ఇది పదోసారి.
Read: నాసా సరికొత్త ప్రకటన: అంగారకుడిపై నివాసం ఉంటారా…!!