Vijayashanthi: ‘సరిలేరు నీకెవ్వరు‘ విషయంలో అంత తృప్తిగా లేరు.. ప్రేక్షకులు సంతృప్తి కోసమే ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
-అందరికీ నమస్కారం. మా చిత్ర బృందం తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవితంలో మంచి సినిమా చేశామనే తృప్తి వుంది. కాప్, మదర్ గా చాలా విరామం తర్వాత ఒక పవర్ ఫుల్ పాత్ర చేయడం జరిగింది. ప్రజలు రాములమ్మని విజయశాంతిని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్ ఫిల్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ అనేది ఒకరకంగా నాకు ఛాలెంజ్. కాని నేను చేశాను. యాక్షన్ పెర్ఫార్మెన్స్ ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అందరూ వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ సినిమాతో తల్లితండ్రులు కొడుకుల బంధాన్ని వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బలంగా చూపిండం జరిగింది. ఈ కథని దర్శకుడు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. మంచి సినిమా చేశామనే తృప్తి వందశాతం వుంది. చాలా మహిళలు ఫోన్ చేసి సినిమా అద్భుతంగా వుంది, మదర్ అండ్ సన్ ఎమోషన్ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. పరీక్షల వలన కొందరు చూడలేకపోయారని నాకున్న సమాచారం. రేపటి నుంచి అందరం వెళ్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రేక్షకాదరణ ఇంకా అద్భుతంగా వుండబోతోంది.
Also Read
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
అఫ్ స్క్రీన్ లో కూడా కళ్యాణ్ రామ్, మీకు మధ్య మదర్ అండ్ సన్ ఎమోషన్ కనిపించింది?
-కళ్యాణ్ బాబు చాలా మంచోడు. సినిమాలో మాకు మంచి బాండ్ ఏర్పడింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. తనకి నాపై చాలా ఆప్యాయత. గత జన్మలో తను నాకు బిడ్డ ఏమో నాకు తెలీదు. ఈ సినిమాకి అన్నీ అద్భుతంగా కుదిరాయి.
చాలామంది రీఎంట్రీ ఇస్తున్నారు? కానీ మీకోసమే రాసుకుంటున్న క్యారెక్టర్స్ రావడం ఎలా అనిపిస్తుంది?
-బిగినింగ్ నుంచి నా ట్రాకే సపరేటు. ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్ళాం.. ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఇన్ని రకాల పాత్రలు చేయడం నాకు కుదిరింది. ఇది గాడ్ గిఫ్ట్ అని భావిస్తాను. ఈ సినిమా కథ కూడా రాసుకున్నప్పుడు నా పాత్ర ఇలా ఉండాలని ముందే డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. పోలీస్ పాత్రలకు నేనైతే బాగుంటుందని ప్రజలు కూడా బలంగా ఫిక్స్ అయిపోయారు. నేను చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఆ రకంగా పాత్రని మలిచారు. ఇన్నాళ్లు ప్రజలు ఎంతో గొప్పగా మమ్మల్ని ఆదరించారు. దీవించారు. నా కెరీర్ బిగినింగ్ నుంచి ఒక డెడికేషన్ క్రమశిక్షణతో వర్క్ చేయడం అలవర్చుకున్నాను. నిరంతరం ఏదో కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించాను. ప్రజలు ఆశీర్వదించి సింహాసనం పై కూర్చోబెట్టారు. ప్రతిఘటన తర్వాత లేడీస్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ప్రజల నుంచే వచ్చింది. అలాగే లేడి జాకీ చాన్ పిలిచారు. ఇదంతా ప్రజల ప్రేమ.
ఈ సినిమాలో ఇంట్రడక్షన్ బురద యాక్షన్ సీక్వెన్స్ కి చాలా మంచి అప్లోజ్ వచ్చింది.. అది చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
-అది చాలా చలికాలంలో తీసిన సీక్వెన్స్. చలికి వణికిపోయాను. ఆ సీక్వెన్స్ ని నైట్ లో తీశారు. చాలా చాలెంజింగ్ గా అనిపించింది. ప్రజల నుంచి ఆ సీక్వెన్స్ కి మంచి అప్లోజ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్ పాటించాను. అలాగే పాత్ర కోసం నిరంతరం వర్క్ ఔట్స్ చేశాను.
అప్పట్లో గ్లామర్ హీరోయిన్ గా ఇటు యాక్షన్ హీరోయిన్ గా.. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసేవారు?
-ఏమో నాకు తెలియదండి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా హీరోలు అందరితో ఫుల్ గ్లామరస్ రూల్స్ చేశాను. ఇటు చంద్రమోహన్ లాంటి హీరోలతో పని చేశాను. దాదాపు 60 మంది హీరోలతో కలిసి పని చేశాను. చాలా ఎక్స్పరిమెంట్లు చేశాను. నా ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది. ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. ఇదంతా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నాకు అలా రాసిచ్చాడు.
డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు మీకు ఆకట్టుకున్న పాయింట్ ఏమిటి?
-మదర్ సన్ ఎమోషన్. యాక్షన్, అలాగే నేను గతంలో చేసిన సినిమా విషయంలో ప్రేక్షకులు అంత తృప్తిగా లేరు. ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక యాక్షన్ సినిమా చేస్తే అభిమానులు ప్రేక్షకులు సంతృప్తి పడతారు అనిపించింది. అలా ఈ సినిమా చేయడం జరిగింది. డైరెక్టర్ ప్రదీప్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తర్కెక్కించారు.
ఈ సినిమా క్లైమాక్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది?
నేను చాలా షాక్ అయ్యాను. చాలా కొత్తగా ఉందనిపించింది. హీరో అలా చేయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఫాన్స్ ఆడియన్స్ ఒప్పుకుంటారా అనిపించింది. నిజంగా అది ఒక ఎక్స్పరిమెంట్. అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు
నిర్మాతల గురించి ?
-చాలా మంచి ప్రొడ్యూసర్స్. ఏనాడు ఇది లేదు అని నేను వినలేదు. ఈ సినిమాకి కావలసిన ప్రతిదీ నిర్మాతలు సమకూర్చారు. ఖర్చుకి వెనకాడకుండా నిర్మించారు.
మీరు సక్సెస్ మీట్ లో క్రిటిక్స్ మీద చేసినా కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యాయి.. ఆ కామెంట్ చేయడానికి కారణం ?
-నేను కొన్నాళ్లుగా చూస్తున్న వాటి మీద స్పందించాను. ఇక్కడ అందరం ఇండస్ట్రీ మీద బతుకుతున్నాం. చాలా బాధ్యతగా వుండాలి. బాగున్న సినిమాపై అలా క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదంటే సజెషన్స్ ఇవ్వచ్చు. మీ దగ్గర కథలంటే చెప్పొచ్చు. కానీ బాగున్న దాని మీద విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదనిపించే ఆరోజు అలా మాట్లాడాను.
అఖండ2 సినిమాలో మీరు నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ?
-నాకు తెలియదండి. మీరు చెప్తుంటే తెలుస్తుంది (నవ్వుతూ)
ఫుల్ లెన్త్ యాక్షన్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని ఉందా ?
-అలాంటి కథ దొరికితే తప్పకుండా ఆలోచిస్తాను.
తాజావార్తలు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
-
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
-
OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
-
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్‌లో బయటపెట్టిన విశాల్
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!