PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
- ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వని ప్రపంచం మొత్తానికి వినిపించింది..
- భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది.
- స్వదేశీ 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై వేగంగా పని జరుగుతోంది.
- మెల్బోర్న్ సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఆస్ట్రేలియాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన మెల్బోర్న్లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచ గుర్తింపును పొందాయని, దేశ సైనిక బలానికి ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిదర్శనమని అన్నారు. ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్ల శబ్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని, ఆ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని చెప్పారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ప్రతిస్పందించిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. భారతదేశ రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూస్తోంది అని మార్వెల్ స్టేడియంలో జరిగిన సభలో అన్నారు. ‘‘ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన పేలుళ్లను మీరు చూసే ఉంటారు. ఆ పేలుళ్ల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. ఉగ్రవాద శిబిరాలపై అలాంటి నిర్ణయాత్మక దాడి జరిగినప్పుడు, మీకు గర్వంగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించినప్పుడు సభలోని భారతీయులు ఒక్కసారిగా చప్పట్లు, నినాదాలతో స్పందించారు.
Also Read
- PM Modi: ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’.. భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
- PM Modi: ఈ షో హౌస్‌పుల్.. బ్లాక్‌బస్టర్.. మెల్బోర్న్ సభపై మోడీ ప్రశంసలు
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్‌లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా స్థిరంగా పయనిస్తోందని మోడీ చెప్పారు. ఒక కల నెరవేరినప్పుడు మరొకటి పుడుతుంది, ఒక లక్ష్యాన్ని సాధించడం మరింత గొప్ప సంకల్పానికి దారి తీస్తుంది. ఇది ‘‘గ్రో మోర్’’, ‘‘అచీవ్ మోర్’’ అని నమ్మే భారతదేశం అని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందన్ని, వీలైనంత త్వరగా ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా ఉందని, భారత్ ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ 6జీ సాంకేతికపై వేగంగా పనిచేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రతిధ్వని ప్రపంచానికి వినిపించింది.. మెల్బోర్న్లో మోడీ కామెంట్స్..
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
-
Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను
-
Pakistan: లిబియాలో శాంతి దూతగా పాక్.. యూఎస్-ఇరాన్ తర్వాత కొత్త మిషన్.. అసలు కారణం వేరే..
-
Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!