Pakistan: లిబియాలో శాంతి దూతగా పాక్.. యూఎస్-ఇరాన్ తర్వాత కొత్త మిషన్.. అసలు కారణం వేరే..
- లిబియా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా పాకిస్థాన్ కొత్త పాత్ర.
- LNAతో 4 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరే అవకాశం.
- ఒకవైపు మధ్యవర్తిత్వం.. మరోవైపు ఆయుధాల ఒప్పందంపై విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. చివరకు మళ్లీ ఈ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు మరో దేశానికి శాంతిదూతగా వెళ్లేందుకు దాయాది దేశం సిద్ధమైంది. అయితే, దీనికి అసలు కారణం వేరేగా ఉంది. లిబియాలో అంతర్యుద్ధంలో శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా ముందుకొచ్చింది. అయితే, దీని వెనక ఆయుధాలు అమ్ముకోవాలనే మాస్టర్ ప్లాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
జూన్ 24న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, రావల్పిండిలో లిబియన్ నేషనల్ ఆర్మీ (LNA) డిప్యూటీ కమాండర్ సద్దాం హఫ్తార్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి ముందు సద్దాం హఫ్తార్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, టర్కీ గూఢచార విభాగం అధిపతితో కూడా సమావేశమయ్యారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
లిబియాలో ఏం జరుగుతోంది.?
ప్రస్తుతం లిబియాలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ యూనిటీ(జీఎన్‌యూ) ట్రిపోలీలో అధికారంలో ఉండగా, తూర్పు లిబియాలో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ స్టెబిలిటీ(జీఎన్ఎస్) అధికారం చెలాయిస్తోంది. జీఎన్ఎస్కు ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని ఎల్ఎన్ఏ మద్దతు ఇస్తోంది. 2026 ఏప్రిల్‌లో ఇరు వర్గాలు ఉమ్మడిగా జాతీయ బడ్జెట్‌కు అంగీకరించినప్పటికీ, ఎన్నికలు, ఏకీకృత సైన్యం, చమురు ఆదాయం విషయంలో విభేదాలు ఉన్నాయి.
ఆయుధాలు డీల్స్ కోసం పాక్ ప్రయత్నం..
విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, ఎన్ఎన్ఏతో పాకిస్తాన్ 4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో చైనా సహకారంలో తయారు చేసిన 16 JF-17 యుద్ధ విమానాలు, 12 సూపర్ ముష్షాక్ శిక్షణ విమానాలు సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలైతే ఒక అరబ్ దేశానికి జేఎఫ్-17 యుద్ధ విమానం అమ్మడం తొలిసారి అవుతుంది.
శాంతిదూత హోదా కోసం తాపత్రయం..
అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వంలో పాక్ అమెరికాకు మరింత దగ్గరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు లిబియా విషయంలో శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్, తన అంతర్జాతీయ ఖ్యాతిని మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. ఇదే కాకుండా, ఈ శాంతి కార్యక్రమం చాటున ఆయుధాలు కూడా అమ్ముకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!