PM Modi: ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’.. భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
- ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’
- భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
- మెల్బోర్న్ సభలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు పాలలో కరిగే చక్కెరలాంటి వాళ్లు.. అది పాలను మరింత మధురంగా చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీయుల ఔనత్యాన్ని కొనియాడారు. భారతీయుల ప్రేమ మాధుర్యాన్ని ప్రపంచమంతటా పంచుతూనే ఉంటారని మోడీ కొనియాడారు. ‘ఇంట్లో పాలు ఆస్ట్రేలియన్ కావచ్చు.. కానీ టీ మాత్రం భారతీయమైనది.. పప్పులు, కూరగాయాలు ఆస్ట్రేలియావే అయినా.. వాటికి అసలైన భారతీయ మసాలాలతో తాలింపు పెడతాం’’ అని అన్నారు.
‘‘21వ శతాబ్దపు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా పయనిస్తోంది. ఒక కల నెరవేరినప్పుడు.. మరో కొత్త కల పుడుతుంది. ఒక దీపం వేలకొద్దీ దీపాలను వెలిగిస్తుందని పూర్వం అనేవారు. కానీ ఈ రోజు నేను ఒక కల మరో కలకు జన్మనిస్తుందని.. అలా వేలాది కలలు ఉద్భవిస్తాయని చెబుతున్నాను. ఒక లక్ష్యం నెరవేరినప్పుడు.. దాని స్థానంలో అంతకంటే గొప్ప సంకల్పం పుడుతుంది. మరింత ఎదగండి, మరింత సాధించండి అనే నినాదాన్ని విశ్వసించే భారతదేశం ఇది. మనం ఆశలు, ఆకాంక్షలతో నిండిన 140 కోట్ల జనాభా గల దేశం.. భారతదేశం.’’ అని అన్నారు.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
‘‘మెల్బోర్న్ను కొందరు లిటిల్ ఇండియా అని.. మరికొందరు మినీ ఇండియా అని పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ, ఇది భారతీయ సంస్కృతిలో పూర్తిగా మునిగి ఉంది. ఒక మార్కెట్‌కు సంబంధించిన వీడియోను ఎవరో తనకు చూపించారని.. ఆ వీడియోలో అక్కడ నిరంతరం అమ్మకాలు జరుగుతున్నట్లు కనిపించింది. ఈ అమ్మకాల ఉత్సాహానికి ప్రజలు పూర్తిగా ఆకర్షితులవుతారు. వారికి షాపింగ్ చేయాలని అనిపించకపోయినా.. చివరికి ఏదో ఒకటి కొనేస్తారు.’’ అని పేర్కొన్నారు.
Excited to be among the Indian community in Melbourne. Their energy and enthusiasm are truly unmatched. They are one of the strongest pillars of India-Australia friendship. https://t.co/dG9F5vj5jr
— Narendra Modi (@narendramodi) July 9, 2026
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!