Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం (Ethanol-blended petrol) వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటుందనే అనుమానాలు, విమర్శలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. ఈ ఇంధనం (E20 Fuel) వల్ల దేశంలో ఒక్క కారుకైనా నష్టం వాటిల్లినట్లు నిరూపించగలరా? అంటూ ఆయన విమర్శకులకు సవాలు విసిరారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై కొందరు కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఇక, దేశీయంగా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, కాలుష్యాన్ని అదుపు చేయడానికి, అలాగే దేశీయ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే ‘E20 ఇంధన’ లక్ష్యాన్ని ఇప్పటికే విజయవంతంగా అందుకుంది. అయితే, ఈ ఇథనాల్ కలపడం వల్ల మైలేజ్ (ఇంధన సామర్థ్యం) తగ్గుతోందని, పాత వాహనాల ఇంజన్లపై దీని ప్రభావం పడుతుందనే చర్చ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చింది. మంగళవారం జరిగిన ‘వికసిత్ భారత్ కాన్క్లేవ్’లో నితిన్ గడ్కరీ ఈ అంశంపై మాట్లాడుతూ.. “E20 పెట్రోల్ వల్ల వాహనాలకు సమస్యలు వస్తున్నాయనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. దేశంలో దీనివల్ల ఏ కారైనా పాడైందా? ఉంటే ఒక్క కారు పేరైనా చెప్పండి” అని ప్రశ్నించారు. ఈ ఇంధనంపై జరుగుతున్న ప్రచారాలు కేవలం పెయిడ్ క్యాంపెయిన్స్ మాత్రమేనని ఆరోపించారు.
అసలు ఏంటో ఈ ఇథనాల్ వివాదం?
చెరకు, జొన్నలు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి తయారుచేసే బయోఫ్యూయల్‌ను (జీవ ఇంధనం) పెట్రోల్‌లో కలపడమే ఈ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. దీనివల్ల దేశానికి ముడి చమురు దిగుమతి ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల మైలేజ్ కాస్త తగ్గుతుందని, అలాగే పాత వాహనాల ఇంజన్లు ఈ తరహా ఇంధనానికి తగినట్లుగా డిజైన్ చేయనందున అవి పాడయ్యే ప్రమాదం ఉందనేది విమర్శకుల వాదన. బ్రెజిల్ వంటి దేశాల్లో వినియోగదారులకు నచ్చిన ఇథనాల్-పెట్రోల్ శాతాన్ని ఎంచుకునే సదుపాయం పెట్రోల్ బంకుల్లో ఉంటుంది. కానీ, భారతదేశంలో ప్రస్తుతం అలాంటి ఆప్షన్ లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు E20 పెట్రోలే ప్రామాణికంగా అందుబాటులో ఉంది.
Also Read
ఇక ఈ అంశంపై కేంద్ర మంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చారు. భారత్ ఇంధన దిగుమతుల కోసం ఏటా దాదాపు రూ. 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వెళ్లడం దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో అవసరమని గడ్కరీ సమర్థించుకున్నారు. ఈ ఇథనాల్ విధానం తన కుటుంబ వ్యాపారాలకు లబ్ధి చేకూర్చేందుకేనంటూ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తమ కుటుంబానికి చక్కెర కర్మాగారాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. తమ వ్యాపారాలు కేవలం ఇథనాల్ ఉత్పత్తిపైనే ఆధారపడలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను మార్చలేదని స్పష్టం చేశారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయడానికి అనుమతించిన తర్వాత రైతులకు ఎంతగానో మేలు జరిగిందని మంత్రి వివరించారు. గతంలో మొక్కజొన్న మార్కెట్ ధర క్వింటాలుకు రూ. 1,200 ఉండగా, మద్దతు ధర (MSP) రూ. 1,800 ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాలుకు రూ. 2,800 కు చేరిందని తెలిపారు. ఈ మార్పు వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!