Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో, చేతికొచ్చిన అవకాశాలను వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ, తనకంటూ కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయని నిరూపించారు ప్రముఖ లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్. తెలంగాణ ఉద్యమ గీతాలతో పాపులర్ అయి, ‘జార్జ్ రెడ్డి’ చిత్రంలోని ‘బుల్లెట్ సాంగ్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’లో ‘రాంబాయి’ పాటలతో వెండితెరపై తన మార్క్ క్రియేట్ చేసిన ఆయన.. తాజాగా ఐటెం సాంగ్స్, బూతు పాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న ‘మారెమ్మ’కి సురేందర్ సాంగ్స్ రాశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కమర్షియల్ సినిమాలకు రాయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఐటెం సాంగ్స్, డబుల్ మీనింగ్ పాటలకు మాత్రం తాను పూర్తిగా దూరమని మిట్టపల్లి సురేందర్ స్పష్టం చేశారు. “నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ దర్శకుడై, తన కమర్షియల్ సినిమా కోసం ఐటెం సాంగ్ రాయమన్నాడు. స్నేహం కోసం పాట రాశాను కానీ, అతనికి ఇవ్వలేదు. నేను రాసే పాట ఏదైనా సరే.. నా తల్లి, నా కూతురు, నా సోదరి అందరూ కలిసి వినేలా ఉండాలి. వాళ్ళు వింటున్నప్పుడు అసహ్యంతో స్కిప్ చేసేలా ఉండకూడదు. ఈ ఐటెం సాంగ్స్ రాయననే మొండితనం వల్ల ఒక సినిమాకు సింగిల్ కార్డ్ (సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం) క్రెడిట్ కూడా కోల్పోయాను. అయినా సరే నా నిర్ణయం మార్చుకోను” అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..