బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్న వేళ ఆ మద్దతును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ఇలా దాడులు చేస్తుందా అనే సందేహాన్ని ప్రధాని వెలిబుచ్చారు.
Read: మహారాష్ట్రను వదలని కరోనా… మళ్లీ 40 వేలు దాటిన కేసులు…
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
బండి సంజయ్‌తో పాటు ఎంతమంది జైలుకు వెళ్లారు, ఎంత మందికి గాయాలయ్యాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తు ఇప్పటి వరకు 9 సార్లు జైలుకు వెళ్లినట్టు ప్రధానికి బండి సంజయ్ తెలిపారు. ప్రజా సమస్యలపై అద్భుతంగా పోరాటం చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పరిమితులకు లోబడి పోరాటాన్ని కొనసాగించాలని ప్రధాని సూచించారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన మద్దతుకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ నెల 5 వ తేదీన పంజాబ్‌లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. జాగరణ దీక్ష ఘటనలో గాయపడ్డ బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!