అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగుతోంది… మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. అయోధ్యలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉదయం 11 గంటలకు పర్చువల్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రధాని.. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.. అయోధ్యలో రామ్ మందిరం కోసం భూమి కొనుగోలుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. రామ్ మందిర్ నిర్మాణ పనుల పురోగతి.. గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రాజెక్ట్ , అయోధ్యలో రాబోయే విమానాశ్రయం మరియు ఆలయానికి వంతెన రహదారి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.. గత వారం రాష్ట్ర ప్రభుత్వం అయోధ్య-సుల్తాన్‌పూర్ రహదారిపై మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించింది, బస్ స్టేషన్‌తో రహదారిని విస్తరించింది. రామ్ మందిర్ భూ ఒప్పందంపై రామ్ మందిర్ ట్రస్ట్‌కు భూమిని అమ్మిన వ్యక్తి పలు ఆరోపణలు చేశారు.. ఈ సమావేశంలో వీటి అన్నింటిపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.