PM Modi: వచ్చే ఏడాది చైనాకు పీఎం మోడీ.. ఇండియాకు రానున్న ట్రంప్, పుతిన్..
- వచ్చే ఏడాది భారత్‌కి ట్రంప్, పుతిన్..
- చైనా పర్యటనకు పీఎం మోడీ వెళ్లే అవకాశం..
- అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా న్యూఢిల్లీ..
- 2025లో ప్రతిష్టాత్మక దౌత్య పర్యటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వచ్చే ఏడాది ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దౌత్య పర్యటనలు జరిగే అవకాశం కనిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే రెండు దేశాలు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకునే ఒప్పందం కుదిరింది. ఇటీవల రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్ సమావేశమయ్యారు.
ఇదిలా ఉంటే, 2025లో భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో చైనాలో జరగబోయే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్ జరుగనుంది. దీని కోసం ప్రధాని చైనాకు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాకు వెళ్లి, సరిహద్దు సమస్యలతో పాటు పలు అంశాలపై అక్కడి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో పాటు ఇతర కీలక నేతలతో చర్చలు జరిపారు. రెండు దేశాలు కూడా తమ సంబంధాలను నార్మల్ చేసుకోవాలని అనుకుంటున్నాయి.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: SSMB : గుంటూరు కారం రీరిలీజ్.. టికెట్ ముక్క మిగలలేదు
ఇదిలా ఉంటే, మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తుండటంతో, ఇన్ కమింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు, అవుట్ గోయింగ్ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో జైశంకర్ చ ర్యలు జరుపుతున్నారు. వచ్చే ఏడాది ప్రధాని నరేంద్రమోడీ హయాంలో జరగబోయే క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. క్వాడ్‌లో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ట్రంప్‌ని కలిసేందుకు పీఎం మోడీ యూఎస్ వెళ్లే అవకాశం ఉందని చెప్పింది.
ఇదిలా ఉంటే, భారత చిరకాల మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్‌లో అడుగుపెట్టినట్లు అవుతుంది. దీనికి తోడు యూరోపియన్ యూనియన్‌తో భారత శికరాగ్ర సమావేశం కూడా న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది. దీనికోసం పలువురు యూరోపియన్ నాయకులు భారత్ రానున్నారు.
జనవరి మధ్యలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం భారత్‌లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సియాంటో జొజోహాదికుసుమో భారత్ రానున్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రిల్ బోరిక్ ఫాంట్ కూడా మార్చి లేదా ఏప్రిల్‌లో భారత్ సందర్శించే అవకాం ఉంది. ఫిబ్రవిలో నరేంద్రమోడీ ఫ్రాన్స్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మోడీ జపాన్ వెళ్లే అవకాశం కూడా ఉంది. 2025 చివరి భాగంలో, G20 సమ్మిట్ దక్షిణాఫ్రికాలో మరియు ASEAN సమ్మిట్ మలేషియాలో జరగాల్సి ఉంది. కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆయా దేశాలకు వెళ్లవచ్చు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!