PM Modi: వచ్చే ఏడాది ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన దౌత్య పర్యటనలు జరిగే అవకాశం కనిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే రెండు దేశాలు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తమ సైన్యాలను వెనక్కి పిలిపించుకునే ఒప్పందం కుదిరింది. ఇటీవల రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్…