టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే తన సినీ కెరీర్ లో ఎన్నడూ చేయని డాన్స్ లు గుంటూరు కారంలో మహేశ్ బాబు చేసాడనే చెప్పాలి. శ్రీలీల తో కలిసి చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్ సినిమా ఈ ఏడాది బిగెస్ట్ సాంగ్స్ లో మొదటి వరసలో ఉంది.
Also Read : Naveen Polishetty : ‘అనగనగా ఒకరాజు’ ప్రీ వెడ్డింగ్ ప్రోమో.. కెవ్వు కేక
ఇదిలా ఉండగా నూతన సంవత్సరం కానుకగా ఈ నెల 31 న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ఫినిష్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ముఖ్య సెంటర్స్ లో గుంటూరు కారం రీరిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని సెంటర్స్ లో ఆల్ షోస్ కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయ్యాయి. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా విడుదలకు మూడేళ్లు సమయం ఉండదంతో అప్పటివరకు మహేశ్ గత సినిమాలను మరోసారి రీరిలీజ్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు . ఈ ఏడాది మహేశ్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ సినిమా మురారి రీరిలీజ్ అయి కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులను సెట్ చేసింది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కు రాబోతున్న గుంటూరు కారం ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.