PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..
- కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలు..
- కేరళ స్టోరీ, ధురంధర్‌పై కూడా అబద్ధాలు ప్రచారం..
- కేరళ ఎన్నికల ర్యాలీలో ప్రధాని తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కేరళ స్టోరీ నుంచి ధురంధర వరకు ప్రతీ సినిమా అబద్ధమని చెబుతున్న ఈ పార్టీలే అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యారని ఆయన అన్నారు. కేరళలోని తిరువల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అబద్ధాలు చెప్పడంలో నిపుణులయ్యాయని విమర్శించారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు అబద్ధాల ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (FCRA), యూనిఫాం సివిల్ కోడ్ (UCC)లకు ఇటీవల చేసిన సవరణలపై అనవసర భయాలు సృష్టిస్తు్న్నారని మండిపడ్డారు.
దేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇరాన్, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మంది భారతీయ వలసదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహించారు. ఎన్నికల ప్రయోజనం కోసం ఈ వలసదారుల భద్రతను కాంగ్రెస్ ప్రమాదంలోకి నెడుతోందని విమర్శించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటల ద్వారా గల్ఫ్ దేశాలో భారత్‌కు ఉన్న బంధాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పశ్చిమాసియా దేశాలు భారత్‌ను శత్రువుగా చూడాలని చూస్తున్నారని కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
ఇరాన్లో పనిచేస్తున్న తమిళనాడు, గోవా, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన భారతీయ మత్స్యకారులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని రక్షించే పనిలో ప్రభుత్వం చురుకుగా నిమగ్నమై ఉందని, ఇప్పటికే వందలాది మంది సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారని ఆయన తెలిపారు. గల్ఫ్, ఇరాన్లో ఉంటున్న భారతీయుల భద్రతకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
శబరిమల ఆలయం నుంచి బంగారం అదృశ్యం కావడంపై మోడీ మాట్లాడుతూ.. పుణ్యక్షేత్రం ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి రెండు వైపులు అని అన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!