PM Modi: ప్రధాని నివాసంలో అత్యున్నత భేటీ.. మిడిల్ ఈస్ట్ సంక్షోభమే ఎజెండా..
- ప్రధాని నివాసంలో అత్యున్నత సమావేశం..
- మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన అధికారిక నివాసం 7-లోక్ కళ్యాణ్ మార్గ్‌లో అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువు రంగాల పరిస్థితిపై సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. దేశానికి చమురు, గ్యాస్, ఎరువుల కొరత లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు- ఎరువులు మరియు ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా, పెట్రోలియం- సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కార్మిక – ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా తదితర సీనియర్ మంత్రులు మరియు అధికారులు హాజరయ్యారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమైంది. భారత్ కూడా గణనీయంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని మోడీ, మంత్రులతో సమావేశమయ్యారు.
Also Read
#WATCH | Delhi | PM Narendra Modi chairs a high-level meeting to review the situation related to petroleum, crude, gas, power and fertiliser sectors in view of the evolving West Asia situation. pic.twitter.com/SOP5TDzWmc
— ANI (@ANI) March 22, 2026
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!