PM Modi: గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్.. దాడులను ఖండించిన ప్రధాని
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు
- గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్
- దాడులను ఖండించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. పెద్ద ఎత్తున బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు మిత్రదేశాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ మద్దతు తెలిపగా.. తాజాగా భారత ప్రధాని మోడీ కూడా మద్దతు తెలిపారు. సౌదీ యువరాజు, బహ్రెయిన్ రాజుతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాలపై జరిగిన దాడులను ఖండించారు.
ఇది కూడా చదవండి: Iran War: గల్ఫ్ దేశాల్లో భారతీయులకు అష్టకష్టాలు.. 3 రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడినట్లుగా మోడీ ఎక్స్‌లో తెలిపారు. ‘‘సౌదీ అరేబియాపై జరిగిన దాడులను భారతదేశం ఖండించింది. ఇది సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడం అత్యంత ముఖ్యమైందిగా భావించాం. ఈ క్లిష్ట సమయాల్లో భారతీయ సమాజ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకున్నందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను.’’ అని రాసుకొచ్చారు.
అలాగే బహ్రెయిన్ రాజు మాన్య రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా ఫోన్ సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. ‘‘బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారతదేశం ఖండిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో బహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి అందించిన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’’ అని మోడీ పేర్కొన్నారు.
Discussed the evolving situation in West Asia with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman. India condemns the recent attacks on Saudi Arabia in violation of its sovereignty and territorial integrity. We agreed that earliest restoration of regional…
— Narendra Modi (@narendramodi) March 2, 2026
Had a productive telephone conversation with the King of Bahrain, His Majesty King Hamad Bin Isa Al Khalifa. India condemns the attacks on Bahrain and stands in solidarity with its people in this difficult hour. I thank him for the steadfast support extended to the Indian…
— Narendra Modi (@narendramodi) March 2, 2026
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!