MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించేందుకు 40,679 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఎన్నికల సమయంలో నిరంతర పర్యవేక్షణ కోసం 3,488 రూట్ మొబైల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు 931 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు, 847 ఎస్ఎస్టీ బృందాలను రంగంలోకి దించారు. రాష్ట్రవ్యాప్తంగా 412 చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే 547 పికెట్ కేంద్రాల వద్ద 1,381 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read
- Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి
- AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
- TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
- YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
సీసీటీవీలు, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ
ఎన్నికల భద్రతను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు, వీడియో ఫుటేజ్‌ను వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది విధుల నిర్వహణను సమర్థ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఎన్నికల విధుల్లో పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ బాక్సుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 178 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి, వాటి వద్ద నిరంతరం పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
-
Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
-
Jwala MK-1: శత్రు డ్రోన్లకు ఇక చెక్! భారత్ జ్వాలా MK-1 పరీక్ష సక్సెస్.. ప్రత్యేకతలు ఇవే!
-
IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
ట్రెండింగ్
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!