PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ రగడ..
- తృణమూల్ కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోడీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సంతాల్ సమావేశం వేదికను మార్చాడాన్ని తప్పుపట్టారు. ఈ పరిణామాలు ‘‘సిగ్గుచేటు, అపూర్వమైనది’’ అని అభివర్ణించారు. శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి, వేదికను బిధాన్నగర్ నుంచి గోషైపూర్‌కు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ లేదా ఇతర మంత్రులు ఎవరూ రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!
Also Read
రాష్ట్రపతి వీడియోను పోస్ట్ చేసిన మోడీ.. ‘‘ తృణమూల్ కాంగ్రెస్ సంతాల్ సంస్కృతిని నిర్లక్ష్యంగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కూడా గిరిజన సమాజానికి చెందినవారని ఎత్తి చూపారు. ఇది సిగ్గుచేటు మరియు అపూర్వమైనది. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడ్డారు. గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతి జీ వ్యక్తం చేసిన బాధ, వేదన భారతదేశ ప్రజల మనస్సులలో తీవ్ర విచారాన్ని కలిగించింది. పశ్చిమ బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం నిజంగా అన్ని పరిమితులను దాటింది. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి వారి పరిపాలన బాధ్యత వహిస్తుంది. సంతాల్ సంస్కృతి వంటి ముఖ్యమైన అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా అంతే దురదృష్టకరం’’ అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్‌కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!