PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- భజన క్లబ్బింగ్‌లో పాల్గొన్న మోడీ
- యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి ‘భజన్ క్లబ్బింగ్’లో పాల్గొన్నారు. సంప్రదాయ భక్తి గీతాలను ఆధునిక సంగీత కచేరీల తరహాలో ఆలపిస్తూ, చప్పట్లు కొడుతూ, కంజర వాయిస్తూ ఉత్సాహపరిచారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతతో కలిసి భక్తి గీతాలను ఆస్వాదించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్న ప్రధాని మోడీ.. భజనలకు అనుగుణంగా చప్పట్లు కొట్టారు. ఒక భజన సమయంలో కంజర వాయిద్యాన్ని కూడా వాయిస్తూ కనిపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం విశేషం. భజనలతో పాటు యువత చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
Also Read
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
ఇంతకీ ‘భజన్ క్లబ్బింగ్’ అంటే?
సాంప్రదాయ భక్తి గీతాలను ఆధునిక సంగీతం, కచేరీ తరహా వాతావరణంతో కలిపి నిర్వహించే కార్యక్రమాలను ‘భజన్ క్లబ్బింగ్’గా పిలుస్తున్నారు. సాధారణ భజన కార్యక్రమాలకు భిన్నంగా.. లైవ్ బ్యాండ్లు, ఆధునిక వాయిద్యాలు, హై-ఎనర్జీ మ్యూజిక్‌తో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో యువత భజనలతో పాటు పాడుతూ, చప్పట్లు కొడుతూ, నృత్యం చేస్తుంటారు. అయితే సాధారణ క్లబ్బింగ్‌కు భిన్నంగా.. ఇక్కడ ప్రధానంగా ఆధ్యాత్మిక, భక్తి గీతాలే ఉంటాయి. ఈ ట్రెండ్‌కు ముఖ్యంగా Gen Z యువతలో ఆదరణ పెరుగుతోంది.
గతంలోనూ మోడీ ప్రస్తావన
‘భజన్ క్లబ్బింగ్’ గురించి ప్రధాని మోడీ గతంలో కూడా ప్రస్తావించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో యువత సంప్రదాయ భక్తి సంగీతాన్ని ఆధునిక శైలితో మేళవిస్తూ కొత్త పద్ధతుల్లో ఆధ్యాత్మికతకు చేరువవుతున్న తీరు ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలోనూ ఈ ట్రెండ్‌ను ప్రస్తావించారు.
దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ..
భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ఢిల్లీ సహా పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. 2026లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలు కాలేజీల్లో కూడా భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాల సిరీస్ నిర్వహించారు. సంప్రదాయ భక్తి సంగీతాన్ని యువతకు చేరువ చేసేలా ఆధునిక సంగీత శైలులను ఉపయోగించడం ఈ కార్యక్రమాల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన భజన్ క్లబ్బింగ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ యువతతో కలిసి పాల్గొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Bhajan Clubbing in Delhi.
Spectacular! https://t.co/BujBa4lzk7
— Narendra Modi (@narendramodi) September 25, 2026
- Tags
- Bhajan Clubbing
- Delhi
- PM Modi
తాజావార్తలు
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!