PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- ఈరోజు ప్రధాని మోడీ 76వ పుట్టినరోజు
- ప్రపంచ నాయకులు శుభాకాంక్షల వెల్లువ
- ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మోడీ కోసం దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ప్రపంచ నాయకులు కూడా బర్త్‌డే విషెస్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోడీ పాత్రను పుతిన్ ప్రశంసించారు.
పుతిన్ ప్రశంసలు
రష్యా రాయబార కార్యాలయం భారత్‌లో పుతిన్ పంపిన జన్మదిన సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. భారత్‌లో మోడీకి ఉన్న ప్రజాదరణ, అంతర్జాతీయ వేదికపై ఆయనకు ఉన్న గౌరవాన్ని పుతిన్ ప్రస్తావించారు. భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మోడీ వ్యక్తిగతంగా కీలక పాత్ర పోషిస్తున్నారని పుతిన్ పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో తన పర్యటన సందర్భంగా తనకు, రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి కూడా మోడీకి ధన్యవాదాలు తెలిపారు. న్యూఢిల్లీలో మోడీతో జరిగిన చర్చలు సారవంతంగా, నిర్మాణాత్మకంగా సాగాయని పుతిన్ అన్నారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలు మరోసారి మోడీ రాజకీయ పరిజ్ఞానం, దూరదృష్టిని చాటాయని పేర్కొన్నారు. భారత్, రష్యా తమ రెండు దేశాలకు సంబంధించిన కీలక అంశాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపైనా భవిష్యత్తులోనూ నిర్మాణాత్మక సహకారాన్ని కొనసాగిస్తాయని పుతిన్ తెలిపారు.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
మోడీకి ట్రంప్ బర్త్‌డే విషెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ట్రంప్ తరఫున మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నామని, రాబోయే ఏడాది ఆయనకు ఆరోగ్యం, ఆనందం కలగాలని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.
మాజీ ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసలు
మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. 76 ఏళ్ల వయసులోనూ మోడీ చూపిస్తున్న ఉత్సాహాన్ని ఆయన ప్రస్తావించారు. “ఆయన ఎనర్జీ లెవల్స్‌ను చూస్తే.. ఇన్నేళ్లు పదవిలో ఉన్నప్పటికీ ఆయన వేగం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు” అని మోరిసన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!