విమానం బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరామం కలగడం కొంతమేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సంఘటన బీహార్‌లోని మోతీహారి ప్రాంతంలోని వంతెన వద్ద జరిగింది. ట్రక్కు ట్రైలర్‌పై విమానం బాడీ తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై విమానం బాడీని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రక్కు బీహార్‌లోని మోతీహారీలో రోడ్డు మీదుగా వెళుతుంది. ఈ నేపథ్యంలో పిప్రకోఠి వంతెన కింద నుంచి ట్రక్కు వెళుతుండగా విమానం ఇరుక్కుపోయింది.
Also Read: Russia-Ukraine War: ఒక్కరాత్రిలో 122 క్షిపణులు, 36 డ్రోన్లు!.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
విమానం బాడీని సేఫ్‌గా బయటకు తీసేందుకు ట్రక్కు డ్రైవర్ బాగా శ్రమించాల్సి వచ్చింది. చివరకి స్థానికుల సహాయంతో అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా క్రాస్ రోడ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఒక సంఘటన జరిగింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన భాగాన్ని ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా అండర్‌పాస్ వద్ద ఇరుక్కుపోయింది. అలాగే కోల్‌కతాలోపాటు పలు ప్రాంతాల్లో కూడా వంతెన కింద విమాన భాగాలు ఇరుక్కున్న సంఘటనలు జరిగాయి.
#BIHAR मोतिहारी में हवाई जहाज फ्लाईओवर के नीचे फंसा, देखने को लगी भीड़:
मोतिहारी के लोगों ने सुबह-सुबह देखा अजीब नजारा, पुलिस ने पहुंचकर किया रेस्क्यू pic.twitter.com/ByuoaVLrb9
— FirstBiharJharkhand (@firstbiharnews) December 29, 2023