Physical attack on Tamil Nadu teenage girl.. Accused gets life: ఓ టీనేజ్ బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడటంతో పాటు.. ఆమెను వ్యభిచారంలోకి దింపిన కేసులో తమిళనాడు ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించగా..ఓ పోలీస్ అధికారి, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలతో పాటు 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
జీవిత ఖైదు పడిన వారిలో బాధితురాలి సవతి తండ్రి, సవతి తల్లి ఉన్నారు. సస్పెండ్ అయిన ఎన్నూర పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీ పుగలేంది, బీజేపీ కార్యకర్త జీ రాజేంద్రన్, ఓ ప్రైవేటు మీడియా ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టు వినోబాజీకి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. మొత్తం 26 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే పారిపోగా.. కేసు విచారణలో ఉన్న సమయంలో ఒకరు మరణించారు. మిగిలిన 21 మందిని విచారించింది కోర్టు. తాజాగా శిక్షలను ఖరారు చేసింది.
Read Also: Supreme Court: ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. శివసేనపై ఈసీదే తుది నిర్ణయం
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 26 మందిపై వాషర్‌మెన్‌పేటలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దాదాపుగా 560 పేజీల చార్జిషీట్ ఫైల్ చేశారు. 2020లో కోర్టుకు సమర్పించారు. నేరం జరిగే సమయానికి 13 ఏళ్ల వయస్సు ఉన్న బాలికపై 100 మందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్‌స్పెక్టర్, రాజకీయ నాయకుడు, జర్నలిస్టు ఆమెను వ్యభిచారంలోకి నెట్టేయడంతో ఈ కేసు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సెప్టెంబర్ 15న పోక్సో చట్టం కింద కేసులను పరిష్కరించేందుకు ఏర్పడిన ప్రత్యేక న్యాయస్థానం మొత్తం 21 మంది నేరస్తులను దోషులుగా ప్రకటించింది. సోమవారం వీరందరికి శిక్షలను ఖరారు చేసింది. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 21 మందిపై విధించిన జరిమానా రూ.2 లక్షలను బాధితురాలికి అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.