Physical assault on two-year-old girl.. Lie detector test for parents: మిజోరాం రాష్ట్రంలో రెండేళ్ల బాలిక మరణంపై తల్లిదండ్రులకే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని మిజోరాం పోలీసుల నిర్ణయించారు. సెప్టెంబర్ 16న రాజధాని ఐజ్వాల్ లో రెండేళ్ల బాలిక లైంగిక వేధింపుల కారణంగా మరణించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్టు చేయనున్నారు. దీనికి తల్లిదండ్రులు ఇద్దరు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మిజోరాం పోలీసులు నిర్వహించే తొలి లై డిటెక్టర్ టెస్టు ఇదే.
Read Also: Chiranjeevi: ధైర్యంగా ఉండు సమంత.. సమస్యలు తొలగిపోతాయి
ఐజ్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఆ సమయంలో బాలిక ఒంటిపై కొన్ని గాయాల కారణంగా బాలిక చనిపోయే ముందు లైంగిక వేధింపులకు గురైనట్లు పోలీసులు అనుమానించి తల్లిదండ్రులపై సుమోటోగా కేసు నమోదు చేసి ఇద్దరిని సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు బాలిక తల్లిదండ్రులకు లై డిటెక్టర్ టెస్టు చేయించనున్నారు. రాష్ట్రంలో పాలిగ్రాఫ్ టెస్ట్ పరికాలు అందుబాటులో లేకపోవడంతో చండీగఢ్ లో వీరిద్దరికి టెస్టు చేయించననున్నారు.
వివరాల్లోకి వెళితే బాలిక ముందుగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అక్యూట్ లారింగోట్రాకియోబ్రోంటిస్ కారణంగా మరణించిందని నిర్థారించినప్పటికీ..బాలిక మృతదేహంపై కొన్ని అసహజ గాయాలు కనిపించాయి. అయితే వైద్యులు పరీక్షలో బాలిక ప్రైవేటు భాగాల్లో పాతవి నయం అయిన గాయాలు కనిపించాయి. దీంతో బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులు, తాత, ఇతర కుటుంబ సభ్యులు, సమీపంలోని అందర్ని ప్రశ్నించారు. ఈ కేసులో బాలిక తండ్రిని అక్టోబర్ 1న, తల్లిని అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు. చాలా మంది బాలిక తల్లిదండ్రులే అనుమానితుల అని స్థానికులు ఆరోపిస్తున్నారు.