Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- యూట్యూబ్, ఇన్‌స్టాలో కోట్ల ఫాలోవర్లు ఉన్న పవన్ సాహూకు షాక్..
- భార్యను ఎన్నికల్లో గెలిపించుకోలేని వైనం..
- మూడో స్థానానికి పరిమితమైన కోమల్ సాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Sahu: సోషల్ మీడియా పాపులారిటీ ప్రజాక్షేత్రంలో గెలిపించడని చాలాసార్లు రుజువైంది. మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, సొంత భార్యను ఎన్నికల్లో గెలిపించలేకపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవన్ సాహూ తన భార్య కోమల్ సాహూను సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టినా, గెలిపించలేకపోయాడు. కోమల్‌కు మొత్తం 277 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడోస్థానానికి పరిమితమైంది.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా, షాపురా ఉపవిభాగం పరిధిలోని ఫూలియా ఖుర్ద్ గ్రామ పంచాయతీలో ఈ ఎన్నికలు జరిగాయి. పవన్ సాహుకు యూట్యూబ్‌లో 27.7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన రీల్స్‌కు భారీగా వ్యూస్ వస్తుంటాయి. అయితే, డిజిటల్ పాపులారిటీ ఎన్ని్కల్లో పనికిరాదని మరోసారి తేలింది.
Also Read
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
- PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ఈ ఎన్నికల్లో భగవతి లాల్ సోనీ 1,203 ఓట్లతో సర్పంచ్‌గా విజయం సాధించారు. మాజీ సర్పంచ్ కాలురామ్ 797 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పవన్ సాహు భార్య కోమల్ సాహు 277 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. పారిశుద్ధ్యం, మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, విద్య, యువత భవిష్యత్ వంటి హామీలు ఇచ్చినా పవన్ భార్యకు పరాజయమే మిగిలింది.
పవన్ సాహూ తన భార్య కోమల్‌ను బరిలోకి దింపి ,స్వయంగా ప్రచారం నిర్వహించారు. ‘‘నా గ్రామ.. నా గుర్తింపు’’ అనే నినాదంతో ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారానికి ‘మిషన్ 2026’గా పేరు పెట్టారు. పవన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా పాపులారిటీ, రాజకీయ మద్దతు మధ్య చాలా తేడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు అభ్యర్థి వ్యక్తిగత గుర్తింపు, స్థానిక ప్రజలతో అనుబంధం, సమస్యల అవగాహనపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!