NTV Telugu Site icon

Delhi: ఎయిర్‌పోర్టులో మెరుగుపడని పరిస్థితులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన పరిసరాలు

Delhi

Delhi

దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులంతా దాదాపు 12 గంటలకు పైగా విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమ్యూనికేషన్, నిర్వహణ లోపమే కారణంగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో విమానాలను అందుకోవల్సిన ప్రయాణికులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Priya Varrier : అజిత్ లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు

శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో శక్తివంతమైన దుమ్ము తుఫాన్ చెలరేగింది. దీంతో చెట్లు, షెడ్లు కూలిపోయాయి. రహదారులపై చెట్ల కొమ్మలు పడిపోయాయి. మరోవైపు ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యం కావడం.. మరికొన్ని రద్దు చేయబడడంతో వందలాది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండి పోవల్సి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదిక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తక్షణమే సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఇక టెర్మినల్ 3 దగ్గర గందరగోళం నెలకొంది. డిస్‌ప్లే బోర్డులు పని చేయడం లేదని.. ఎయిరిండియా సిబ్బంది కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: IPL 2025: గుజరాత్‌ టైటాన్స్‌కు మరో షాక్.. ఐపీఎల్ 2025 నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!

ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విమాన రాకపోకలు తిరిగి నెమ్మది నెమ్మదిగా పునరుద్ధరించబడుతున్నాయని వర్గాలు పేర్కొంటున్నాయి.