దుమ్ము తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా 205 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీని దుమ్ము తుఫాన్ బెంబేలెత్తించింది. శుక్రవారం ఊహించని రీతిలో ఈదురుగాలులు హడలెత్తించాయి. దీంతో చెట్లు నేలకూలాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్ అర్ధరాత్రి వరకు బీభత్సం సృష్టించింది.