Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగియడానికి ముందు బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సవాల్ విసిరింది. విద్యార్థుల నిరసన, లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతుండగా, ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు పదే పదే ప్రతిపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుధాన్షు త్రివేది ప్రతిపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల సమయంలో సభ నుంచి వెళ్లిపోతున్నారని, సమావేశాల అనంతరం విదేశాలకు వెళ్తున్నారని విమర్శించారు. “భయపడకండి.. పారిపోకండి.. సభలో అమిత్ షా చెప్పేది వినండి” అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. విద్యార్థుల నిరసనలపై హోం మంత్రి సమగ్రంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం ప్రకటన చేయడం కాకుండా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
Also Read
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
ఇదిలా ఉంటే, నిరసనకారులపై పోలీస్ చర్య, అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల అంశంలో ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పే వరకు పార్లమెంట్లో తమ నిరసన కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించమని అమిత్ షా ఆదేశించారా లేదా అనే దానిపై స్పష్టత కావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..