ముంబైలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై కారు కొనుగోలు చేసే ముందు, లేదంటే అద్దెకు తీసుకున్నా.. పార్కింగ్ స్థలం ఉంటేనే కార్ల అమ్మకాలు జరిపేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Oscars 2025 Nominations: ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే ముందు పార్కింగ్ స్థలాన్ని చూపించాలనే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. నగరంలో అనేక పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేశామని.. వీటిని ఇప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా యాక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. ఈ విధానం త్వరలో అమలులోకి రావచ్చని ఫడ్నవీస్ తెలిపారు. పబ్లిక్ స్థలాల్లో పారింగ్ చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.
మరోవైపు ముంబైలో శాంతిభద్రతల సమస్యపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై కూడా ఫడ్నవిస్ స్పందించారు. ముంబై భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన నగరమన్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఒక విధంగా దేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోలిస్తే ముంబైనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Gandhi Tatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ.. సుకుమార్ కూతురు సినిమా ఎలా ఉందంటే?